schedule Thursday, September 17, 2026

హస్తంలో అలజడి..!

calendar_today October 17, 2022
person dharshininews
హస్తంలో అలజడి..!
హస్తంలో అలజడి..! - పార్టీకి పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్ రాజీనామా - పీసీసీ డెలిగేట్‌ పదవి తొలగింపుపై అలక..? తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో అలజడి రేగింది. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం ఇందుకు కారణమయ్యింది. జెడ్పీటీసీ ధారాసింగ్ కాంగ్రెస్‌ పార్టీలో సీనీయర్ సీనీయర్ నాయులుగా కొనసాగుతున్నారు. పార్టీ నుంచి పీసీసీ డెలిగేట్ పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం తాండూరులోనే కాదు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి సమాచారం లేకుండా ధారాసింగ్‌ను పీసీసీ డెలికేట్‌ పదవి నుంచి తప్పించడంతో ఆయన అలక వహించినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ధారాసింగ్ రాజీనామా పత్రాన్ని జిల్లా కమిటికి అందజేసినట్లు ప్రచారం జరిగింది. పార్టీకి రాజీనామా చేసిన ఆయన జెడ్పీటీసీగా కొనసాగనున్నారు. కాని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్న ధారాసింగ్ రాజీనామా చేయడం ఆ పార్టీకి నష్టం కలగక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.