schedule Thursday, September 03, 2026

వాట్సాప్‌ సేవలకు వీడిన గ్రహణం

calendar_today October 25, 2022
person dharshininews
వాట్సాప్‌ సేవలకు వీడిన గ్రహణం
వాట్సాప్‌ సేవలకు వీడిన గ్రహణం - 2 గంటల తరువాత పునరుద్దరణ - ఇబ్బందులు పడ్డ వినియోగదారులు - సంస్థపై విరుచుకుపడిన మీమర్స్‌ దర్శిని డెస్క్‌ : అత్యంత వినియోగదారులు ఉన్న వాట్సాప్‌ ఫ్లాట్ ఫారంకు కొద్ది సేపు గ్రహణం పట్టినంత పనైంది. దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్‌ సర్వీసులు నిలిచిపోయాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో వాట్సాప్‌ సేవలకు అంతరాయం కలిగింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ నెట్‌వర్క్‌ మధ్యాహ్నం 12.30 నుంచి కుప్పకూలింది. సాంకేతిక సమస్యలతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మెసేజ్‌ డెలివరీ స్టేటస్‌ను వాట్సాప్‌ చూపించకపోవడంతో వినియోగదారులు ఆందోళన పడ్డారు. వాట్సాప్‌లో డబుల్‌ టిక్‌ , బ్లూటిక్‌ మార్కులు చూపించ లేదు. గ్రూపుల్లో మెసేజులు వెళ్లడం లేదని, వ్యక్తిగత మెసేజులు పంపిస్తే బ్లూటిక్‌ రావడం లేదని పలువురు వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌ వెబ్‌కి కనెక్ట్‌ చేస్తున్నప్పుడు ‘కనెక్టింగ్‌’ అని కొన్నిసార్లు, నెట్‌వర్క్‌ కనెక్టివిటీ లేదు అని కొన్నిసార్లు వస్తున్నట్లు యూజర్లు పేర్కొన్నారు. దాదాపు రెండు గంటల తరువాత అంటే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాఫ్ సేవల్లో అంతరాయంపై మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్‌ సేవలపై ఫిర్యాదులు మొదలయ్యాయి. వాట్సాప్‌ పనిచేయకపోవడంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. వాట్సాప్‌ యూజర్లంతా ట్విటర్‌ వైపు పరుగులు తీస్తున్నారని ఒకరు కామెంట్‌ పెడితే.. వాట్సాప్‌కు గ్రహణం పట్టిందంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. అయితే 2 గంటల తరువాత సంస్థ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని, అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ వాట్సాప్‌ యూజర్లకు క్షమాపణ చెప్పింది. అయితే, సేవలు నిలిచిపోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. People Coming to Twitter to see if WhatsApp is down#WhatsappDown pic.twitter.com/eGi25KiQhU — Bella Ciao (Chai) (@punjabiii_munda) October 25, 2022 వాట్సాప్ వినియోగదారులందరికీ డౌన్ అయిందో లేదో తనిఖీ చేయడానికి ట్విట్టర్‌కి వచ్చినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు. coming to see if whatsapp’s down with the one ticks pic.twitter.com/I34wnH4Cy4 — 🍞 (@bakedt0ast) October 25, 2022 “ఒక టిక్ మాత్రమే కనిపిస్తుంది.. వాట్సాప్ డౌన్ అయిందో లేదో చూడడానికి వస్తున్నాను” అంటూ ఓ యూజర్ ట్విట్ చేశాడు