schedule Sunday, July 05, 2026

లక్ష్మీ దేవీ నమోస్తుతే..!

calendar_today November 3, 2022
person dharshininews
లక్ష్మీ దేవీ నమోస్తుతే..!
లక్ష్మీ దేవీ నమోస్తుతే..! - సాయిపుత్ర హోమ్స్ లో వైభవంగా లక్ష్మీపూజ - సతీసమేతంగా పూజలు చేసిన బావనోళ్ల శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: లక్ష్మీదేవీ నమోస్తుతే.. అంటూ తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్ అమ్మవారిని వేడుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా గురువారం సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ కార్యాలయంలో లక్ష్మీపూజను వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శంకర్ యాదవ్ సతీమణి చంద్రకళతో కలిసి లక్ష్మీపూజ చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, నేతలు సాయిపూర్ బాల్ రెడ్డి, బంటు మల్లప్ప, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, న్యాయవాదులు పాశం రవిందర్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, యాదవ సంఘం నాయకులు మనోహర్ యాదవ్ ( స్పైస్), పలువురు రాజకీయ ప్రముఖులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.