schedule Thursday, September 17, 2026

కనుల పండువగా కార్తీక దీపోత్సవం

calendar_today November 7, 2022
person dharshininews
కనుల పండువగా కార్తీక దీపోత్సవం
కనుల పండువగా కార్తీక దీపోత్సవం - మార్కండేయుని గుడిలో దీపాల వెలుగులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పరిధి కోడంగల్ రోడ్డు మార్గంలో ఉన్న మార్కండేయ స్వామి దేవాలయంలో కార్తీక దీపోత్సవం కన్నుల పండువగా జరిగింది. సోమవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దేవాలయంలో భక్తులు కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పద్మశాలీయులు, ఇతర భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి మార్కండేయునికి, శివునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవాలయం మొత్తం దీపాలను వెలిగించారు.