schedule Thursday, September 17, 2026

దశల వారిగా వార్డు అభివృద్ధి

calendar_today November 14, 2022
person dharshininews
దశల వారిగా వార్డు అభివృద్ధి
దశల వారిగా వార్డు అభివృద్ధి - మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి - కాంగ్రెస్ కౌన్సిలర్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: దశల వారిగా వార్డును అభివృద్ధి పరిచి అన్నివిధాల ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు, 25వ వార్డు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. సోమవారం తన వార్డులోని విద్యుత్ స్థంబాలకు ప్రభాకర్ గౌడ్ ఎల్ఈడీ లైట్లను బిగించే పనులను చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కారానికి ప్రాధాన్యమివ్వడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా వార్డులో విద్యుత్ స్థంబాలకు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయించడం జరుగుతుందన్నారు. దశల వారిగా వార్డులో మౌళిక సదుపాయాలను కల్పించి వార్డును అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేలా దృష్టిసారించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా విద్యుత్, తాగునీరు, సీసీ రోడ్డు, మురుగు కాలువలు తదితర సమస్యలను దశల వారిగా పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, యువకులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.