schedule Sunday, July 05, 2026

సూపర్ స్టార్ కృష్ణది చెరగని ముద్ర

calendar_today November 15, 2022
person dharshininews
సూపర్ స్టార్ కృష్ణది చెరగని ముద్ర
సూపర్ స్టార్ కృష్ణది చెరగని ముద్ర - చిత్రసీమకు అందించిన సేవలు చిరస్మరణీయం - హీరో కృష్ణ మరణం బాధాకరం - సంతాపం ప్రకటించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలుగు ప్రజల హృదయాల్లో సూపర్ స్టార్ కృష్ణ వేసిన ముద్ర ఎప్పటికి చెరగలేనిదని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. దర్శకులు, నిర్మాత, తెలుగు అభిమానులు సూపర్ స్టార్ కృష్ణ అని పిలుచుకునే (ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి 79) మరణం పట్ల మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు. అయిదు దశాబ్దాల పాటు తెలుగు చలన చిత్ర రంగానికి విశేష సేవలు అందించిన సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం బాధాకరమన్నారు. 300లకు పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినిమా ఖ్యాతి ని పెంచడం లో కృష్ణ గారు చాలా ప్రయోగాలు చేసి విజయం సాధించిన తీరు ఎప్పటికి మరువలేనిదన్నారు. సినిమా రంగం అభ్యున్నతికి సూపర్ స్టార్ అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థించారు.