schedule Sunday, September 06, 2026

వచ్చే యేడాదిలో ప్రభుత్వ సెలవులు ఖరారు

calendar_today November 17, 2022
person dharshininews
వచ్చే యేడాదిలో ప్రభుత్వ సెలవులు ఖరారు
వచ్చే యేడాదిలో ప్రభుత్వ సెలవులు ఖరారు - 28 సాధారణ, 24 ఐచ్చికం జాబితా విడుదల హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : వచ్చే యేడాది 2023 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రతి యేడాది సాధారణ, ఐచ్ఛిక, వేతనంతో కూడిన సెలవును ముందే ప్రకటించడం జరుగుతోంది. ఇందులో భాగంగా 2023లోని సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు 28 రోజులను సాధారణ సెలవులుగా, మరో 24 రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వేతనంతో కూడిన సెలవులను (నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌) 23గా నిర్ధారిస్తున్నట్లు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. సాధారణ సెలవులు ఐచ్చిక సెలవులు వేతన సెలవులు