schedule Thursday, September 17, 2026

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి

calendar_today November 17, 2022
person dharshininews
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి - మున్సిపల్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శినిప్రతినిధి: బాల్య వివాహాల నిర్మూలనకు అందరు కృషి చేయాలని తాండూరు మున్సిపల్ సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. చైల్డ్‌ లైన్‌ సే దోస్తీ వారోత్సవాలలో భాగంగా గురువారం సాయిపూర్‌ స్వీపర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కౌన్సిలర్ నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. వయస్సు నిండకుండానే చిన్నతనంలో బాలికలకు బాల్య వివాహాలు చేయరాదన్నారు. అలా చేస్తే చట్టరిత్య నేరం అవుతుందని అన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అందరు కృషి చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు తోడ్పాటు అందించాలని, ఇందుకు చైల్డ్ లైన్, ఎంవీ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. చైల్డ్‌ లైన్ 1098తో కలిసి బాలల హక్కుల పరిరక్షణకు తనవంతు సహాకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ ప్రతినిధి జ్యోతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.