schedule Sunday, July 05, 2026

కాంగ్రెస్ కలెక్టరేట్ దర్నాను జయప్రదం చేద్దాం

calendar_today December 4, 2022
person dharshininews
కాంగ్రెస్ కలెక్టరేట్ దర్నాను జయప్రదం చేద్దాం
కాంగ్రెస్ కలెక్టరేట్ దర్నాను జయప్రదం చేద్దాం - రేవంత్ రెడ్డి రాకకు కార్యకర్తలు భారీగా తరలిరావాలి - కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: రేపు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహించే దర్నాను జయప్రదం చేయాలని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించే దర్నాకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి రాక సందర్భంగా తాండూరు నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ వద్ద రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు కలెక్టరేట్ కార్యాలయం ముందు చేపట్టే దర్నాలో పాల్గొని తెలంగాణ సర్కారు రైతులకు చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని తెలిసేలా వాణిని వినిపించాలని.. ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.