schedule Sunday, July 05, 2026

మహిమాన్వితుడు దత్తాత్రేయుడు

calendar_today December 8, 2022
person dharshininews
మహిమాన్వితుడు దత్తాత్రేయుడు
మహిమాన్వితుడు దత్తాత్రేయుడు - మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ - దత్త జయంతి సందర్భంగా భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి: పలు దేవతా మూర్తులకు జ్ఞాన బోధ చేసిన దత్తాత్రేయుడు మహిమాన్వితుడు అని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. గురువారం దత్త జయంతి సందర్భంగా ఆయన గాన్గాపూర్‌లో వెలసిన దత్తాత్రేయ స్వామిని విఠల్‌ నాయక్‌ దర్శించుకున్నారు. ఆలయంలో వెలసిన దత్తాత్రేయునికి వేద పండితుల మంత్రోచ్చరణల మద్య పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి యేడాది మాదిరిగానే దత్త జయంతిని పురస్కరించుకుని వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వికల్ నాయక్ మాట్లాడుతూ దత్తాత్రేయుని మహిమలు అనిర్వచనీయమన్నారు. ఎందతో మహ పురాణపురుషులకు, దేవతలకు జ్ఞాన బోధ చేసిన దైవ స్వరూపుడు అని అన్నారు. దత్తాత్రేయుని కృపతో ఆధ్యాత్మిక చింతనను పొంది తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.