schedule Sunday, July 05, 2026

టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులుగా సందీప్ రెడ్డి

calendar_today December 9, 2022
person dharshininews
టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులుగా సందీప్ రెడ్డి
టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులుగా సందీప్ రెడ్డి - ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేతుల మీదుగా నియామకం తాండూరు, దర్శిని ప్రతినిధి: టీఆర్ఎస్ విద్యార్థి విభాగం(టీఆర్‌ఎస్వీ) తాండూరు పట్టణ అధ్యక్షులుగా యువ నాయకుడు సందీప్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా క్యాంపు కార్యాలయంలో సందీప్ రెడ్డి నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సందీప్ రెడ్డిని అభినందిస్తూ టీఆర్ఎస్ పార్టీ బలోపేతంతో పాటు విద్యార్థి సమస్యల పరిష్కారంలో ముందుండాలన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులుగా నియామకం అయిన సందీప్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్ష బాధ్యతలను అప్పగించినందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నరేందర్ గౌడ్, కౌన్సిలర్ ముక్తార్, సోషల్ మీడియా ఇంచార్జ్ రమేష్, ఇంతియాజ్, ఎబినేజర్, జగన్ తదితరులు ఉన్నారు.