schedule Saturday, July 04, 2026

నకీలీ క్రిమిసంహారక మందులపై కొరడా

calendar_today December 13, 2022
person dharshininews
నకీలీ క్రిమిసంహారక మందులపై కొరడా
నకీలీ క్రిమిసంహారక మందులపై కొరడా - ఫర్టిలైజర్స్ షాపులపై జిల్లా టాస్క్‌ఫోర్స్‌ దాడులు - పెద్దేముల్‌లో 30 కిలోల హస్పెట్ పౌడర్ పట్టివేత - షాపు యజమానిపై కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి: నకిలీ క్రిమిసంహారక మందుల విక్రమాలపై వికారాబాద్‌ జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు కొరడా జులిపించారు. మంగళవారం పెద్దేముల్ మండలంలో అకస్మిక దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని బాబా ట్రేడర్స్ అండ్‌ ఫర్టిలైజర్ షాపులో దాడులు చేపట్టగా అందులో ఎలాంటి అనుమతులు లేని హస్పేట్ ఫౌడర్‌ విక్రయాలను గుర్తించారు. దాదాపు 30 కిలోల హస్పేట్ ఫౌడర్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా విక్రయాలు చేపడుతున్న షాపు యజమాని నయూం అనే వ్యక్తిని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఈ మందు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేపట్టారు. ఈక్రమంలో తాండూరు పట్టణంలోని హనుమాన్ ఫర్టిలైజర్ షాపు నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసింది. టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాదీనం చేసుకున్న హస్పేట్ ఫౌడర్‌ను వ్యవసాయ పొలాల్లో క్రిమిసంహారక మందులలో కలిపి పిచికారి చేస్తారని అధికారులు తెలిపారు.