schedule Friday, July 10, 2026

జాతరకు ముస్తాబు

calendar_today December 14, 2022
person dharshininews
జాతరకు ముస్తాబు
జాతరకు ముస్తాబు - ఎల్లుండి నుంచి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం నెహ్రుగంజ్‌లో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ దేవాలయం జాతర ఉత్సవాలకు ముస్తాబైంది. 16 నుంచి ఆలయంలో జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేకా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తామని, అదే విధంగా మహిళలచే పెద్ద ఎత్తున భోనాల ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. శనివారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున ఈ జాతర ఉత్సవాల్లో పట్టణ ప్రజలు, మహిళలు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు.