schedule Saturday, July 04, 2026

నిరుద్యోగులకు సర్కారు అండ

calendar_today December 20, 2022
person dharshininews
నిరుద్యోగులకు సర్కారు అండ
నిరుద్యోగులకు సర్కారు అండ - స్టడీ సెంటర్లతో ఉద్యోగ అభ్యర్థులకు మేలు బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ తాండూరు, దర్శిని ప్రతినిధి: నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తోందని బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ అన్నారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బీసీ స్టడీ సెంటర్ ఏర్పాటు తరువాత గ్రూప్ 3, 4 అభ్యర్థులకు 90 రోజుల్లో సిలబస్ మొత్తం పూర్తయ్యింది. ఈ సందర్భంగా మంగళవారం స్టడీ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ హాజరై మాట్లాడారు. స్టడీ సెంటర్ లో అభ్యర్థులకు అందించిన బోధనపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం తెలంగాణ సర్కారు అండగా నిలుస్తుందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థుల కోసం ఉచితంగా బీసీ స్టడీ సెంటర్ ను ఏర్పాటు చేసి ఎంతో మేలు చేసిందన్నారు. స్టడీ సెంటర్ సేవలను ఉపయోగించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారి భీం రాజు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రవీందర్, విద్యార్థులు పాల్గొన్నారు.