schedule Friday, September 18, 2026

రోహిత్‌ రెడ్డి బందువుల ఇంట్లో విషాధం

calendar_today December 21, 2022
person dharshininews
రోహిత్‌ రెడ్డి బందువుల ఇంట్లో విషాధం
రోహిత్‌ రెడ్డి బందువుల ఇంట్లో విషాధం - అయ్యప్ప దీక్ష విరమించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - ఈనెల 26న జరిగే పడిపూజ రద్దు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బంధువుల ఇంట్లో విషాధం నెలకింది. దీంతో అయ్యప్ప మాల ధారణలో ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దీక్షను విరమించుకున్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమీప బంధువు బషీరాబాద్ మండలం ఇందర్ చెడ్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి కుమారుడు శశికాంత్ రెడ్డి అనార్యోగ సమస్యలతో కన్నుమూశారు. ఈ కారణంగా దీక్షను విరమించాల్సి వచ్చిందని సన్నిహితులు తెలిపారు. అదేవిధంగా ఈనెల 26న నిర్వహించాలనుకున్న అయ్యప్ప పడిపూజను కూడ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రద్దు చె సుకున్నారు. ఈ విషయాన్ని అందరు గమనించాలని పార్టీ నేతలు సూచించారు.