schedule Saturday, July 04, 2026

అట్టహాసంగా ఐవీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

calendar_today December 25, 2022
person dharshininews
అట్టహాసంగా ఐవీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
అట్టహాసంగా ఐవీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ - టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా విడుదల - తాండూరు ఐవీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐఏఎఫ్) కు సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఆదివారం హైదరాబాద్ లో వైశ్య భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం అండ్ డెవలప్ మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై 2023 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. అదేవిధంగా ఐవీఎఫ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ సమక్షంలో ఐవీఎఫ్ తాండూరు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తాండూరు ఐవీఎఫ్ అధ్యక్షులుగా కేళిగారి ప్రవీణ్ కుమార్, కార్యదర్శిగా రెడ్డిశెట్టి సతీష్, కోశాధికారిగా చల్ల గుణవర్ధన్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్త 2023-24 నియమాక పత్రాలను అందజేసి అభినందించారు. సేవా కార్యక్రమాలతో ఐవీఎఫ్ ప్రతిష్టను పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ (న్యూఢిల్లీ) సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంజి రాజమౌళి గుప్త, తెలంగాణ రాష్ట్ర కోశాధికారి నారాయణ. వికారాబాద్ జిల్లా కోశాధికారి ఆగీర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.