schedule Friday, September 18, 2026

రిక్వెస్ట్ స్టాపులు ఏర్పాటు చేయండి

calendar_today December 28, 2022
person dharshininews
రిక్వెస్ట్ స్టాపులు ఏర్పాటు చేయండి
రిక్వెస్ట్ స్టాపులు ఏర్పాటు చేయండి - ఆర్టీసీ డీఎంకు టీపీవీఎఫ్ వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రిక్వెస్ట్ స్టాపులు ఏర్పాటు చేయాలని తాండూరు ఆర్టీసీ డిపో మేనేజర్ సమతకు తాండూరు పబ్లిక్ వాయిస్ ఫోరం(టీపీవీఎఫ్) సభ్యులు కోరారు. బుధవారం ఆర్టీసీ డిపో మేనేజర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని మిత్రాగనగర్, అయ్యప్ప నగర్, గ్రీన్ సిటీ కాలనీ వాసుల కోసం తాండూరు నుంచి కోడంగల్ రోడ్డు మార్గంలో, హైదరాబాద్ రోడ్డు మార్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రిక్వెస్ట్ స్టాపులను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు జిలాని, భాను పవార్, వెంకటేష్ గౌడ్, హన్మంతు, న్యాయవాది జే.ప్రకాష్, డిగ్రీ కళాశాల అధ్యక్షులు మజర్, శ్రీను. రాజు తదితరులు పాల్గొన్నారు.