schedule Sunday, July 05, 2026

అద్భుత పుణ్యక్షేత్రం భూకైలాస్

calendar_today December 30, 2022
person dharshininews
అద్భుత పుణ్యక్షేత్రం భూకైలాస్
అద్భుత పుణ్యక్షేత్రం భూకైలాస్ - కోడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి - భూకైలాస్‌ను సందర్శించిన ఎమ్మెల్యే - సన్మానించిన శంకర్ నాయక్, వాసుపవార్ నాయక్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ జ్యోతిర్లింగాల దేవస్థానం అద్భుత పుణ్యక్షేత్రమని కోడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కితాబిచ్చారు. శుక్రవారం భూకైలాస్ దేవాలయాన్ని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆల్ ఇండియా బంజార సేవా సంఘం అధ్యక్షులు శంకర్ నాయక్, వాసుపవార్ నాయక్లు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి దేవాలయంలోని శివున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భూకైలాస్ దేవాలయం మహా శివుడు, వీరభద్రుడు, కాల భైరవుడు, వీరాంజనేయ స్వామి, జ్యోతిర్లింగాలు, మహారుద్రుడు, అంబభవాని, సేవాలాల్, శక్తి పీఠాలు వంటి దేవతా మూర్తులతో విరాజిల్లుతు అద్భుత పుణ్యక్షేత్రంగా పరుఢవిల్లుతుందని అభివర్ణించారు. అనంతరం శంకర్ నాయక్, వాసు నాయక్ పవార్లు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని శాలువా పూలమాలలో ఘనంగా సన్మానించారు.