schedule Friday, September 18, 2026

చదివిన పాఠశాలకు చేయూత

calendar_today January 4, 2023
person dharshininews
చదివిన పాఠశాలకు చేయూత
చదివిన పాఠశాలకు చేయూత - విద్యార్థులకు ఐడీ కార్డులు అందించిన పూర్వవిద్యార్థి - అభినందనలు తెలిపిన ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాను చదివిన పాఠశాలకు తన వంతు చేయూతను అందించడం జరుగుతుందని యాలాల మండలం ముద్దాయి పేట్ ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థి కోడూరు గౌరి శంకర్ అన్నారు. బుధవారం గ్రామ మాజీ సర్పంచ్ కోడూరి విఠలయ్య చిన్న కుమారుడు కోడూరు గౌరి శంకర్ గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న 110 మంది విద్యార్థులకు సొంత ఖర్చులతో ఉచితంగా ఐడీ కార్డులను తయారు చేయించి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు తన వంతు చేయూతగా గతంలో మైక్ సెట్ అందించడం జరిగిందని, భవిష్యత్తులో మరింత తోడ్పాటు అందిస్తామని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు మెరు గైన విద్యనందించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ఐడీ కార్డులను అందించడం పట్ల ఉపాధ్యాయులు గౌరి శంకర్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం షేక్ అహ్మద్, ఎస్ఎంసీ చైర్మన్ రేష్మా భేగం, ఉపాధ్యాయులు శ్రీనివాస్, రాములు, అనసూయ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు