schedule Tuesday, September 08, 2026

చికిత్సలు, వైద్య సేవలు భేష్..!

calendar_today January 5, 2023
person dharshininews
చికిత్సలు, వైద్య సేవలు భేష్..!
చికిత్సలు, వైద్య సేవలు భేష్..! - జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్ కు కితాబు - ఆసుపత్రులను సందర్శించిన కాయకల్ప బృందం తాండూరు, దర్శని ప్రతినిధి: తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్) లలో రోగులకు అందించే చికిత్సలు, సేవలు భేష్ గా ఉన్నాయని కాయకల్ప కితాబిచ్చింది. ప్రతి యేడాది కేటాయించే కాయకల్ప అవార్డు ఎంపికలో భాగంగా జరిగే ఇంటర్నల్ పరిశీలనలో భాగంగా గురువారం గజ్వేల్ ఆసుపత్రి కాయకల్ప బృందం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రులను సందర్శించింది. ఆసుపత్రులు సూపరిండెంట్ డాక్టర్ రవిశంకర్ తో కలిసి ఆయా ఆసుపత్రులలోని రోగులు, మెడికల్, ఆపరేషన్ థియేటర్ వార్డులను పరిశీలించారు. వైద్య సేవలతో పాటు పారిశుద్ధ్యం, పరిసరాల నిర్వహణ వంటి తదితర అంశాలను క్షుణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, నిర్వహణ తదితర సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాయకల్ప అవార్డు ఎంపిక కోసం ఆసుపత్రుల్లో మరిన్ని సర్వీలు జరుగుతాయని, ఈ సర్వేను ఉన్నతాధికారులకు అందజేస్తామని కాయకల్ప బృందంలోని గజ్వేల్ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సాయి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు ఆర్ఎంఓ డాక్టర్ రాము, పర్యవేక్షణ సభ్యురాలు కె. మరియా, నోడల్ ఆఫీసర్ స్వామి, జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమణబాబు, డాక్టర్ ఆనంద్ గోపాల్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.