schedule Friday, September 18, 2026

పీఆర్టీయూ టీఎస్ తాండూరు పట్టణ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక

calendar_today January 7, 2023
person dharshininews
పీఆర్టీయూ టీఎస్ తాండూరు పట్టణ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక
పీఆర్టీయూ టీఎస్ తాండూరు పట్టణ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక - అధ్యక్షులుగా దస్తయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్ రెడ్డిలు ఏకగ్రీవం తాండూరు, దర్శిని ప్రతినిధి : పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం తాండూరు అర్బన్ శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నిక శనివారం ఏకగ్రీవంగా జరిగింది. పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి, పత్రికా సంపాదకులు జైపాల్ రెడ్డిల సమక్షంలో పీఆర్టీయూ టీఎస్ తాండూరు అర్బన్ శాఖ అధ్యక్షులుగా ఆర్.దస్తయ్య, ప్రధాన కార్యదర్శిగా టీ. శ్రీనివాస్ రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళ ఉపాధ్యక్షురాలు నిజాంబీ, సాదియా అహమ్మదీ, పట్టణ మాజీ అధ్యక్షులు భీంరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, యాలాల మండల అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ రెడ్డి, యాదయ్య, బషీరాబాద్ అధ్యక్షులు నర్సింహారెడ్డి, గౌరవాధ్యక్షులు రవికాంత్, పెద్దేముల్ అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.