schedule Saturday, September 19, 2026

పైలెట్‌తోనే తాండూరు ప్రగతి..!

calendar_today January 11, 2023
person dharshininews
పైలెట్‌తోనే తాండూరు ప్రగతి..!
పైలెట్‌తోనే తాండూరు ప్రగతి..! - ఎమ్మెల్యేను కలిసిన బీఆర్ఎస్వీ అధ్యక్షులు సందీప్ రెడ్డి - పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే ప్రగతి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి.. పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సందీప్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజక వర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, తాండూరుకు ఎన్నడు లేని విధంగా నిధులు సాధించి తీసుకవస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఎన్ని కుట్రలు చేసినా ఫలించవన్నారు. వచ్చే ఎన్నికల్లో రోహిత్ రెడ్డిని గెలిపించుకుని మంత్రిగా చూసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కలిసిన వారిలో వాల్మీకి నగర్ బీఆర్ఎస్ యువనాయకులు ఉన్నారు.