schedule Saturday, July 04, 2026

పండగ చోరీలకు కళ్లెం..!

calendar_today January 12, 2023
person dharshininews
పండగ చోరీలకు కళ్లెం..!
పండగ చోరీలకు కళ్లెం..! - ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇళ్లు సేఫ్‌ - సొంత ఊరు వెళ్లే వారికి పోలీసుల సూచనలు తాండూరు, దర్శిని ప్రతినిధి: పండగొస్తుందంటే అందరు సొంత ఊరు వెళ్లాలని, కుటుంబ సభ్యులు.. బందువులతో సరాదాగ గడపాలని ముందే ప్రణాళికలు వేసుకుంటారు. పండగల సమయాల్లోనే ఇంట్లోకి చొరబడే అనుకోని అతిథుల వల్ల ఇళ్లు గుల్లై పండగ సంతోషాన్ని విషాధంలో నెట్టే సంఘటనలు జరుగుతుంటాయి. అయితే పండగ సమయాల్లో జరిగే చోరీలకు కళ్లెం వేసే ప్రయత్నం మన చేతుల్లోనే ఉందని పోలీసు శాఖ సూచిస్తుంది. పండగ చోరీలను నియంత్రించడంలో భాగంగా సొంత ఊరు వేళ్లే ప్రజలకు సలహాలు, జాగ్రత్తలను అందిస్తోంది. వాటి ద్వారా దొంగల నుంచి కొంతైన సురక్షితంగా ఉండొచ్చని అధికారులు సూచిస్తున్నారు. పోలీసు శాఖ సూచించిన జాగ్రత్తలు • ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి. • ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి. • విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టడం చేయరాదు. • ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. • బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి. • గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి. • విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. • ఆరుబయట వాహనాలకు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ వేయాలి. • ఇంటి తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకొని, వాచ్ మెన్ లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. • సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సిసి కెమెరాలను ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. • ప్రజలు ఇండ్లలోనుండి బయలు దేరెముందు గ్యాస్ లివర్ తప్పని సరిగా ఆఫ్ చేయడం, షార్ట్ సర్కుట్ కాకుండా జాగ్రతలు పాటించాలి. • ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి. తమ ప్రాంతం పరిధి లోని పోలీస్ స్టేషన్ అధికారి ఫోన్ నెంబర్ ఇతర అధికారుల నెంబర్ లు ప్రజలు తమ సెల్ ఫోన్ లలో ఉంచుకోవాలి. • అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ కు గాని సంబందిత పోలీస్ అధికారులకు గాని సమాచారం ఇవ్వాలి.