schedule Friday, September 18, 2026

వైభవంగా సంక్రాంతి వేడుకలు

calendar_today January 12, 2023
person dharshininews
వైభవంగా సంక్రాంతి వేడుకలు
వైభవంగా సంక్రాంతి వేడుకలు - ఆకట్టుకున్న విద్యార్థుల రంగవల్లికలు - శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో గురువారం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోటీ పడుతూ వేసిన విద్యార్థుల రంగవల్లికలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం తెలిపే విధంగా ఆపిల్ కిడ్స్ విద్యార్థులు వేసుకున్న దుస్తులు ఆకట్టుకున్నాయి. రంగ్గవల్లికలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆపిల్ కిడ్స్ ప్రిన్సిపల్ వనజ, శ్రీ సాయి మేధ విద్యాలయ ప్రిన్సిపల్ సజిత విద్యార్థులకు సంక్రాంతి విశిష్టతను వివరించారు. యువతకు స్ఫూర్తిదాయకమైన స్వామి వివేకానందుని జాడల్లో నేటి తరం నడవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.