schedule Sunday, July 05, 2026

సమాజ సేవలో ఆదర్శంగా నిలవాలి

calendar_today January 12, 2023
person dharshininews
సమాజ సేవలో ఆదర్శంగా నిలవాలి
సమాజ సేవలో ఆదర్శంగా నిలవాలి - వాసవీ క్లబ్ జిల్లా క్యాటెనెట్ సెక్రటరి రొంపల్లి సంతోష్ కుమార్ -తాండూరు కార్యవర్గానికి బాధ్యతల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వాసవి క్లబ్ సేవలను సమాజంలో ఆదర్శంగా నిలపాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వికారాబాద్ జిల్లా క్యాబినెట్ జాయింట్ సెక్రటరి రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. 2023-24 సంవత్సరానికి గాను వాసవి క్లబ్ తాండూరు శాఖ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గురువారం తాండూరు అధ్యక్షులుగా రెడ్డి సతీష్, ఉపాధ్యక్షులుగా బీద వీరేష్, సెక్రటరీగా చల్లా గుణవర్ధన్, జనరల్ సెక్రటరీగా మంకాల్ రఘురాం, కోశాధికారిగా చల్లా వినయ్, జోన్ చైర్మన్ గా కేళిగారి ప్రవీణ్ కుమార్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా గుముడాల గౌరీశంకర్లకు నియామక పత్రాలను అందజేసి శాఖ బాధ్యతలను అప్పగించారు. అదేవిధంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకుని స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అనాథలకు, అభ్యాగులకు, పేదలకు, విద్యార్థులకు సేవలందించడంలో వాసవి క్లబ్ ముందుంటుందని, వాసవి క్లబ్ సేవలను సమాజంలో ఆదర్శంగా నిలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు. యువకులు తదితరులు పాల్గొన్నారు.