కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..!
January 12, 2023
dharshininews
కేవీసీఎస్‌లో సంక్రాంతి జోష్..!
- ముందస్తు సంబరాలు అదరహో
- ఆకట్టుకున్న సంప్రదాయ ప్రదర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్(కేవీసీఎస్)లో సంక్రాంతి పండగ జోష్ నెలకొంది. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురురవారం స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు వేడుకలను అదరహో అనిపించేలా జరుపుకున్నారు.
సంక్రాంతి పండగలో కనిపించే వివిధ వేషాధారణలో విద్యార్థులు మెప్పించారు. సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చే రంగవల్లను స్కూల్ విద్యార్థులు అందంగా తీర్చిదిద్దారు. తీరొక్క రంగులతో ముగ్గులు వేసి.. గొబ్బెమ్మలు ఉంచి పూజలు చేశారు. డూడూ బసవణ్ణల ప్రదర్శనలతో స్కూల్ విద్యార్థులు అలరించారు. సంక్రాంతి ముగ్గులు, బసవణ్ణలతో పాటు విద్యార్థులు పలు నృత్య ప్రదర్శనలతో సంక్రాంతి సంబరాలను సంతోషంగా జరుపుకున్నారు. స్కూల్ ఆవరణలో నిర్వహించిన వేడుకలలో స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.