schedule Sunday, July 05, 2026

అట్టహాసంగా ఎం.రమేష్‌ మహారాజ్ జన్మదినం

calendar_today January 14, 2023
person dharshininews
అట్టహాసంగా ఎం.రమేష్‌ మహారాజ్ జన్మదినం
అట్టహాసంగా ఎం.రమేష్‌ మహారాజ్ జన్మదినం - గజమాలతో సన్మానించిన ముదిరాజ్ సంఘం - కేక్ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎం.రమేష్‌ మహరాజ్ జన్మదిన వేడుకలు తాండూరులో అట్టహాసంగా జరిగాయి. శనివారం రమేష్ మహారాజ్ జన్మదినాన్ని తాండూరు ముదిరాజ్ సంఘం ఆద్వర్యoలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో నాయకులు, అభిమానుల సమంక్షంలో నిర్వహించారు. ఈ వేడుకలకు తాండూరు నియోజకవర్గంలోని యాలాల్, బషిరాబాద్, తాండూర్, పెద్దెముల్ మండలాలకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు, సభ్యులు భారీగా తరలి వచ్చారు. రమేష్‌ మహరాజ్‌ ను గజమాలతో సన్మానించారు. కేక్‌ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రమేష్ మహరాజ్ జన్మదిన సందర్భంగా పట్టణంలోని విలియమ్ మూన్ నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. ఇందిరా చౌరస్తాలో క్రేన్ ద్వారా రమేష్ మహరాజ్ ని గజమాల తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్, వికారాబాద్ జిల్లా ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు లొంకా నర్సింలు, తాండూరు నియోజకవర్గం ముదిరాజ్ అధ్యక్షులు రవికాంత్, తాండూరు పట్టణ ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణు గోపాల్, జనరల్ సెక్రటరీ రాము, తాండూరు మండలం ముదిరాజ్ యూవజన అధ్యక్షులు జగదీష్, యాలల్ మండల ముదిరాజ్ యూవజన అధ్యక్షులు తిరుపతి, పెద్దముల్ మండల ముదిరాజ్ యూవజన అధ్యక్షులు లొంకా రాములు, బషీరాబాద్ మండల ముదిరాజ్ యూవజన అధ్యక్షులు నరేందర్, నాయకులు కృష్ణ ముదిరాజ్, భీమ్మప్ప అగ్గనూర్, సంగెం హన్మంతు, బోయిని నర్సిములు, మల్కాపూర్ జర్నప్ప, ముదిరాజ్ నాయకులు, యూవకులు తదితరులు పాల్గొన్నారు.