schedule Thursday, July 09, 2026

మైలాపూర్ మల్లన్నగా శివుడు

calendar_today January 15, 2023
person dharshininews
మైలాపూర్ మల్లన్నగా శివుడు
మైలాపూర్ మల్లన్నగా శివుడు - భద్రేశ్వరాలయంలో ప్రత్యేక దర్శనం - దర్శించుకున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం ప్రసిద్ద భావిగి భద్రేశ్వర దేవాయలంలో వెలసిన శివుడు మైలాపూర్ మల్లన్న స్వామిగా దర్శనమిచ్చారు. ఆదివారం సంక్రాంతి పండగ సందర్భంగా ఆలయ పూజారి విజయ్ కుమార్ స్వామి ఆలయంలో వెలసిన శివున్ని కర్ణాటక రాష్ట్రం మైలాపూర్‌లో వెలసిన మల్లన్న స్వామిగా అలంకరణ చేశారు. ఆలయానికి వచ్చిన భక్తులు మల్లన్న స్వామిగా దర్శనిమిచ్చిన శివున్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు.