schedule Sunday, July 05, 2026

తెలంగాణ వడ్డెర యువజన సంఘం జిల్లా యూత్ అధ్యక్షులుగా జగదీష్

calendar_today January 16, 2023
person dharshininews
తెలంగాణ వడ్డెర యువజన సంఘం జిల్లా యూత్ అధ్యక్షులుగా జగదీష్
తెలంగాణ వడ్డెర యువజన సంఘం జిల్లా యూత్ అధ్యక్షులుగా జగదీష్ - జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులుగా వడ్డె వెంకటేష్ - రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయినమల్లు చేతులు మీదుగా నియామకం తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ వడ్డెర యువజన సంఘం వికారాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులుగా కె.జగదీష్, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులుగా వడ్డె వెంకటేష్ లు ఎన్నికయ్యారు. సోమవారం తెలంగాణ వడ్డెర సంఘం, చారిటబుల్ ట్రస్టు జిల్లా అధ్యక్షులు మద్దంగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయినమల్లుతో సంఘం సభ్యులు భేటి అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వడ్డెర యువజన సంఘం వికారాబాద్ జిల్లా యూత్ అధ్యక్షులుగా కె.జగదీష్, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులుగా వడ్డె వెంకటేష్ లను ఎన్నుకుని రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయినమల్లు చేతుల మీదుగా నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వడ్డెరుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని, వడ్డెరుల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. అనంతరం నూతన అధ్యక్షులు జగదీష్. వెంకటేష్ లు రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.