schedule Sunday, July 05, 2026

సేవా మూర్తి రొంపల్లి సంతోష్ కుమార్

calendar_today January 18, 2023
person dharshininews
సేవా మూర్తి రొంపల్లి సంతోష్ కుమార్
సేవా మూర్తి రొంపల్లి సంతోష్ కుమార్ - పేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ - వికలాంగులకు వీల్ చైర్ల వితరణ తాండూరు. దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన యువనాయకులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, వాసవీ క్లబ్ క్యాబినెట్ జిల్లా సెక్రటరీ, లయన్స్ క్లబ్ కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ సేవామూర్తిగా నిలిచారు. బుధవారం జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థులకు భారీ గ్రీన్ మ్యాట్‌ విరాళంగా అందజేశారు. అదేవిధంగా పట్టణంలోని 20 మంది నిరు పేదలకు నిత్యవసర సరుకులతో పాటు ఇద్దరు వికలాంగులకు వీల్ చైర్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలో ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు. ప్రతి యేడాది సమాజంలోని నిరు పేదలకు, వికలాంగులకు, ప్రకృతి బాధితులకు తమ వంతు సేవ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. రొంపల్లి సంతోష్ కుమార్ సేవలను పలువురు సభ్యులు, నేతలు అభినందించారు.