schedule Thursday, July 09, 2026

ఎస్‌బీఐ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి హీరూ పవార్ కన్నుమూత

calendar_today January 30, 2023
person dharshininews
ఎస్‌బీఐ బ్యాంకు రిటైర్డ్  ఉద్యోగి హీరూ పవార్ కన్నుమూత
ఎస్‌బీఐ బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగి హీరూ పవార్ కన్నుమూత - నివాళులు అర్పించిన బషీరాబాద్‌ శాఖ బ్యాంకు ఉద్యోగులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ శాఖ ఎస్‌బీఐ బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగి హీరూ పవార్ కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం ఆయన స్వగ్రామం బషీరాబాద్‌ మండల కేంద్రంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం కుటుంబ సభ్యులు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. మరణించిన హీరూ పవార్ బషీరాబాద్‌ ఎస్‌బీఐ బ్యాంకులో దస్తరిగా పనిచేసి చాలా ఏళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బషీరాబాద్ శాఖ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ భవాత్, ఉద్యోగులు లక్ష్మణ్, మక్సూద్, హరిదాస్ తదితరులు వారి నివాసానికి చేరుకుని హీరూ పవార్ భౌతిక ఖాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా అందించారు. మరణించిన హీరూ పవార్‌కు భార్య, పిల్లలు ఉన్నారు.