schedule Tuesday, September 08, 2026

మూడు రోజులు తాగునీరు సరఫరా బంద్

calendar_today January 31, 2023
person dharshininews
మూడు రోజులు తాగునీరు సరఫరా బంద్
మూడు రోజులు తాగునీరు సరఫరా బంద్ - మిషన్‌ భగీరథ పంపిణీలో అంతరాయం - ఎందుకోసమో అంటే.. ప్రకటించిన అదికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరాపై కీలక ప్రకటన చేశారు. మూడు రోజుల పాటు మిషన్‌ భగీరథ తాగునీరు సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీశైలం నుంచి పరిగి మార్గంలో మిషన్‌ భగీరథ పైపులు లీకేజీలకు గురికావడంతో తాగునీరు సరఫరా నిలిచిపోతుందన్నారు. మూడు రోజులు అంటే ఫిబ్రవరి 3వ తేది వరకు మిషన్‌ భగీరథ సరఫరా జరగదని అన్నారు. కావున ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.