schedule Saturday, September 19, 2026

విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేయండి

calendar_today February 1, 2023
person dharshininews
విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేయండి
విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేయండి - వినతిపత్రం అందించిన కౌన్సిలర్ బొంబీనా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని తన వార్డులో విద్యుత్ సంబాలను ఏర్పాటు చేయాలని 14వ వార్డు కౌన్సిలర్ బొంబీనా కోరారు. బుధవారం తాండూరు విద్యుత్ ఏడి ఆదినారాయణను కలిసిన బొంబీనా వినతిపత్రం అందజేశారు. తమ వార్డులోని ఫాతిమా మజీద్, కర్బలా మైదాన్, మున్సిపల్ క్వార్టర్స్, శ్రీ మాణిక్ నగర్ ప్రాంతాలలో విద్యుత్ స్థంభాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కావున ఆయా ప్రాంతాలలో విద్యుత్ స్థంబాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈ రఘువీర్ రెడ్డి ఉన్నారు.