schedule Sunday, July 05, 2026

వక్ఫ్ బోర్డు భూముల అభివృద్ధికి తోడ్పాటు

calendar_today February 6, 2023
person dharshininews
వక్ఫ్ బోర్డు భూముల అభివృద్ధికి తోడ్పాటు
వక్ఫ్ బోర్డు భూముల అభివృద్ధికి తోడ్పాటు - రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌ను కలిసిన బీఆర్ఎస్ నాయకులు - మైనార్టీల సంక్షేమానికి హామి: అధ్యక్షులు అప్పూ(నయూం) తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని వక్ఫ్ బోర్డు భూముల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసి ఉల్లాహ్ హామి ఇచ్చినట్లు బీఆర్ఎస్ పట్టణ అప్పూ(నయూం) తెలిపారు. సోమవారం అప్పూ(నయూం) ఆధ్వర్యంలో పార్టీ తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ అస్లాం, ఉర్దూఘర్ మాజీ చైర్మన్ అబ్దుల్ సలీం, మల్కాపూర్ మాజీ ఉప సర్పంచ్ హసన్ పటేల్‌లు తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మసి ఉల్లాహ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు వారు చైర్మన్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా తాండూరులోని వక్ఫ్ బోర్డు భూముల విషయంపై చర్చించారు. ఇందుకు చైర్మన్ మసి ఉల్లాహ్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహాకారంతో రానున్న కొద్ది మాసాల్లోనే వక్ఫ్ బోర్డు భూముల అభివృద్ధికి కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు అప్పూ(నయూం) తెలిపారు. అదేవిధంగా తాండూరులోని మైనార్టీల సంక్షేమానికి సహాకారం అందిస్తామని అన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీఆర్ఎస్ నాయకులు ముంషాద్ తదితరులు పాల్గొన్నారు.