schedule Friday, September 18, 2026

ఈద్గాకు మహర్షిశ

calendar_today February 8, 2023
person dharshininews
ఈద్గాకు మహర్షిశ
ఈద్గాకు మహర్షిశ - శరవేగంగా అభివృద్ధి పనులు - బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) తాండూరు, దర్శని ప్రతినిధి: తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జమియత్ ఆహ్హ హారీస్ ఈధ్రాకు మహర్దశ వచ్చిందని బీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. బుధవారం బీఆర్ఎస్ తాండూరు పట్టణ పట్టణ అధ్యక్షులు అఫ్పూ ఆధ్వర్యంలో పలువుడు నాయకులు. కమిటీ సభ్యులు ఈ పనులు పరిశీలించారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గతంలో ఈద్గా అభివృద్ధి కోసం రూ. 20 లక్షలు మంజూరు చేశారు. తాజాగా పనులు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ నేతలు, కమిటి సభ్యులతో కలిసి పనులను పరిశీలించారు. ఈద్గా అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డీఎంఎఫ్టీ ద్వారా రూ. 20 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని, దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈద్గా అభివృద్ధి కోసం మరో రూ. 10లక్షలు మంజూరు చేయబోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈద్గా కమిటి అధ్యక్షులు అబ్దుల్లా ముజాహిద్, జమియత్ ఆప్లే హదీస్ అధ్యక్షులు ఉస్మాన్‌ ఘని మహమ్మద్, కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ ముజాహిది, కోశాధికారి షల్లో, హసనోద్దీన్, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.