schedule Friday, September 18, 2026

ప్రభాకర్ గౌడ్‌ ఇంటికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్

calendar_today February 9, 2023
person dharshininews
ప్రభాకర్ గౌడ్‌ ఇంటికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్
ప్రభాకర్ గౌడ్‌ ఇంటికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ - అనారోగ్యంతో ఉన్న పార్టీ పట్టణ అధ్యక్షునికి పరామర్శ - దగ్గరుండి అప్యాయంగా పలకరింపు తాడూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్‌ నివాసానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ వెళ్లారు. గత కొన్ని రోజుల నుంచి ప్రభాకర్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇంటికి పరిమితం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహరాజ్ గురువారం ప్రభాకర్ గౌడ్ నివాసానికి చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్ గౌడ్‌ను అప్యాయంగా పలకరించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మనోధైర్యంతో ఉండాలని, వైద్య సలహాలు పాటిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మేమంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. రమేష్ మహరాజ్ వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, నాయకులు ఉత్తమ్‌చంద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆలీం, యూత్ కాంగ్రెస్ తాండూరు పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.