schedule Tuesday, September 08, 2026

లోపాల నియంత్రణకే కంటి వెలుగు

calendar_today February 10, 2023
person dharshininews
లోపాల నియంత్రణకే కంటి వెలుగు
లోపాల నియంత్రణకే కంటి వెలుగు - పేదల కంటి చూపుకు సర్కారు ప్రాధాన్యం - మున్సిపల్ కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల కంటి లోపాలను నియంత్రించేందుకు తెలంగాణ సర్కారు కంటి వెలుగును ప్రవేశ పెట్టిందని తాండూరు మున్సిపల్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం వార్డు నెంబర్ 20లో కంటి వెలుగు-2 శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ సంగీత ఠాకూర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధత్వ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ శిబిరాలలో పేదల కంటి లోపాలను నియంత్రించడం జరుగుతుందన్నారు. సమస్యలు ఉన్న పేదలు శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కంటి పరీక్షల అనంతరం ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలు, మందులు పంపిణీ చేస్తుందని అన్నారు. ఆపరేషన్లు అవసరమైనవారికి ప్రభుత్వమే చేయిస్తుందని అన్నారు. పేదల కంటిచూపుకు ప్రాధాన్యమిస్తున్న సర్కారు కంటి వెలుగు సేవలను అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగును అమలు చేయడం పట్ల సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరిష్‌రావు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిబిరం వైద్యులు డా. ఝాన్సీ, డా. అరుందతి, సూపర్ వైజర్ అంబిక, ఏఎన్ఎంలు సుమలత, మాధవి, అంగన్ వాడి టీచర్ రాధ, ఆర్పీ శోభ, స్కూల్ టీచర్లు మాధవి, రాణి, ఆశా వర్కర్లు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.