schedule Saturday, July 04, 2026

బాదుడు.. పార్టీ..!

calendar_today February 14, 2023
person dharshininews
బాదుడు.. పార్టీ..!
బాదుడు.. పార్టీ..! - బర్త్‌డే పార్టీకి పిలిచి బందువులపై దాడి - మద్యం మత్తులో యువకుడి దుశ్చర్య - వికారాబాద్‌ జిల్లాలో ఘటన వికారాబాద్, దర్శిని ప్రతినిధి: ఆనందంగా జరగాల్సిన బర్త్‌డే పార్టీని కాస్తా.. ఓ యువకుడు మద్యం మత్తులో బాదుడు పార్టీ చేసుకున్నాడు. కుమారుడి పుట్టిన రోజు వేడుకల కోసం బందువులు పిలిచి చితక్కొట్టాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా కేంద్రాఆనికి సమీపంలో ఉన్న అత్వెల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ సోమవారం తన కుమారుని మొదటి బర్త్ డే బంధువులందరిని ఆహ్వానించాడు. వచ్చిన వారంతా బర్త్‌ డే వేడుకల్లో ఉత్సహాంగా పాల్గొనగా కొద్ది సేపటి తరువాత మద్యం మత్తులో వరుసకు బందువు రాజును కారు ఇవ్వమని అడుగా.. మద్యం ఉన్నందన ఆయన నిరాకరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య వాగ్వివాదం జరిగింది. మాటా మాటా పెరిగి గొడవ ఉద్రిక్తంగా మారింది. సహనం కోల్పోయిన నవీన్ కుమార్ యువకుడు బందువులందరి పై విచక్షణ రహితంగా దాడిచేసాడు. ఇంట్లో నుంచి ఎవరూ వెల్లకుండా బయటినుంచి తాలం వేసి హాల్ చల్ చేశాడు. పిల్లలు పెద్దలు బిక్కు బిక్కు మంటూ డైల్ 100 సమాచారం ఇవ్వడంతో ... సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.... యువకుడుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపడంతోపాటు వైరల్‌ అయ్యింది. https://youtu.be/t0nlsLiEGgk