schedule Saturday, September 19, 2026

ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి

calendar_today February 15, 2023
person dharshininews
ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి
ఘనంగా సేవాలాల్ మహరాజ్ జయంతి - నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కుమారుడు రినీష్‌ రెడ్డి - జయంతిలో పాల్గొన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ - తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలు బుధవారం తాండూరులో ఘనంగా జరిగాయి. ఆల్ ఇండియా బంజార వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు వాసుపవార్ నాయక్, పెద్దేముల్ జెడ్పీటీసీ ధారాసింగ్, బంజారా సంఘాల ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని బాలాజీ సర్సింగ్ హోం సమీపంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, తాండూరు జెడ్పీటీసీ గౌడ్ మంజుల వెంకటేశం, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్ తదితరులు నివాళులు అర్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, హేమంత్ కుమార్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కావలి సంతోషాలు కూడా సేవాలాల్ జయంతిలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బంజారా జాతికోసం, గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. గిరిజనులంతా ఐక్యమత్యంగా ఉంటూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాలో మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.