schedule Saturday, September 19, 2026

వైభవంగా శివపార్వతుల కళ్యాణం

calendar_today February 17, 2023
person dharshininews
వైభవంగా శివపార్వతుల కళ్యాణం
వైభవంగా శివపార్వతుల కళ్యాణం - మార్కండేయ స్వామి దేవాలయంలో పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. ము హాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించారు. పార్వతీ దేవి తరుపున ఝాన్సి, శివానంద్ సింగ్ దంపతులు, శివుని తరుపున సరిత, చంద్రమౌళి తరుపున పాల్గొని కళ్యాణాన్ని కమణీయంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయానికి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. మరోవైపు ఆలయ కమిటి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ వార్తను సమర్పించిన వారు...