schedule Saturday, September 19, 2026

సల్లంగా చూడు పరమేశ్వరా..!

calendar_today February 18, 2023
person dharshininews
సల్లంగా చూడు పరమేశ్వరా..!
సల్లంగా చూడు పరమేశ్వరా..! - శివునికి పూజలలో కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: సల్లంగా చూడు పరమేశ్వరా అంటూ తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ శివున్ని ఆరాధించారు. శనివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తాండూరు పట్టణంలో నకరేశ్వర స్వామి దేవస్థానం, పోట్లీ మహారాజ్ దేవాలయం, అంతప్పబావి శివాలయం, చెరువెంటి ఈశ్వారాలయం, రాచన్న దేవస్థానంలో వెలసిన శివున్ని దర్శించుకున్నారు. సతీమణితో కలిసి శివలింగాలకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ మాట్లాడుతూ తాండూరు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ పరమశివుని కోరుకున్నట్లు తెలిపారు.