schedule Sunday, September 20, 2026

జిల్లా కలెక్టర్‌ను కలిసిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌

calendar_today February 23, 2023
person dharshininews
జిల్లా కలెక్టర్‌ను కలిసిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌
జిల్లా కలెక్టర్‌ను కలిసిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ - పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ కలిశారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ కార్యాయలంలో చైర్‌ పర్సన్ స్వప్న పరిమళ్‌ పార్టీ కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్‌తో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా నారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పుష్పగుచ్చం అందించి స్వాగతం చెప్పారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.కొన్ని రోజుల్లోనే జిల్లాలో పరిపాలయ యంత్రాంగాన్ని చక్కదిద్దడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టడంపై కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్‌తో అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, బోయరవిలు ఉన్నారు.