schedule Saturday, July 04, 2026

ఇంటింటిలో సోదాలు..!

calendar_today February 25, 2023
person dharshininews
ఇంటింటిలో సోదాలు..!
ఇంటింటిలో సోదాలు..! - మాణిక్ నగర్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్ - అదుపులోకి 80 బైకులు, 6 ఆటోలు, ఒక కారు తాండూరు, దర్శిని ప్రతినిధి: శాంతి భద్రతలతో పాటు ప్రజల సంరక్షణ కోసం పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నేరాల నియంత్రణ కోసం కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలను చేపడుతోంది. తాజాగా శనివారం తాండూరు పట్టణ పోలీసులు తమ పరిధిలోని పాత తాండూరు మాణిక్ నగర్లో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్డెన్ సెర్చ్ కార్యక్రమంలో డిఎస్పీ శేఖర్ గౌడ్ హాజరై తనీఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలతో పాటు సిబ్బంది కాలనీలో ఇంటింటి సోదాలు నిర్వహించారు. ఇంట్లో నివాసముంటున్న కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించారు. అనుమానితుల వివరాలను సేకరించారు. తనిఖీలలో భాగంగా దాదాపు 80 బైకులు, 6 ఆటోలు, ఒక కారును అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్సీ శేఖర్ గౌడ్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం పోలీసుల కార్డెన్ సెర్చ్ ఒక భాగమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మహిపాల్ రెడ్డి, వేణు గౌడ్, సిబ్బంది, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.