schedule Saturday, July 04, 2026

కేవీసీఎస్‌లో అబ్బుర పరిచిన ఎడ్యుకేషనల్ ఫెయిర్

calendar_today February 26, 2023
person dharshininews
కేవీసీఎస్‌లో అబ్బుర పరిచిన ఎడ్యుకేషనల్ ఫెయిర్
కేవీసీఎస్‌లో అబ్బుర పరిచిన ఎడ్యుకేషనల్ ఫెయిర్ - సైన్స్ పరికరాలతో ఆకట్టుకున్న స్కూల్ విద్యార్థులు - అభినందించిన అతిథులు, ఉపాధ్యాయులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భావి భారత శాస్త్ర వేత్తలకు తీసిపోమనే విధంగా తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ఆకట్టుకున్నారు. జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా ఆదివారం పాఠశాలలో నిర్వహించిన ఎడ్యూకేషనల్ ఫేయిర్ (వైజ్ఞానిక ప్రదర్శన) అబ్బురపరిచింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను తాండూరు నుండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సైన్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ప్రైవేటు స్కూల్ యజమాన్యం అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డిలు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు అంతరిక్ష పరిశోధనలు, బేటీ పడావ్ - బేటీ బచావ్, కాళేశ్వరం ప్రాజెక్టు, వ్యవసాయం, కంప్యూటర్ పరిజ్ఞానం, ఆధునిక జీవన శైలి వంటి విభిన్న ప్రదర్శనలతో అతిథుల దృష్టిని ఆకట్టుకున్నారు. సృజనాత్మకతతో తయారు చేసిన విద్యార్థుల ప్రదర్శనలను అభినందించారు. మరోవైపు ఎడ్యూకేషనల్ ఫెయిర్ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య, సాంఘిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్నిరంగాల్లో రాణించాలి ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రపరిజ్ఞానంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకుని అందుకోసం కష్టపడాలని అన్నారు. ఎంచుకున్న రంగంలో రాణించి, పేరు, ప్రఖ్యాతలను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ మల్లె పల్లి వెంకటేశం, ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.