schedule Saturday, September 19, 2026

గొప్ప శాస్త్రవేత్తలు కావాలి

calendar_today February 28, 2023
person dharshininews
గొప్ప శాస్త్రవేత్తలు కావాలి
గొప్ప శాస్త్రవేత్తలు కావాలి - సీవీ రామన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి - మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ తాండూరు, దర్శిని ప్రతినిధి: విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలు కావాలని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. మంగళవారం జాతీయ వైజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని సెయింట్ మేరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కోట్రిక విజయలక్ష్మీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులతో మాట్లాడి వైజ్ఞానిక ప్రదర్శనలతో నైపుణ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ భారత శాస్త్ర వేత్త సీవి రామన్‌ 1928లో రామన్‌ ఎఫెక్ట్‌ను ఫిబ్రవరి 28వ తేదిన కనుగొన్నందుకు ప్రతి యేడాది జాతీయ వైజ్ఞానిక దినోత్సవం జరుపుకుంటున్నామని విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు సీవీ రామన్, అబ్దుల్ కలాం వంటి మేధావులను ఆదర్శంగా తీసుకుని గొప్ప శాస్త్రవేత్తకాలు కావాలని ఆకాంక్షించారు. దేశానికి, ప్రపంచానికి సేవలందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.