schedule Sunday, July 05, 2026

మృతురాలి కుటుంబానికి సాయం

calendar_today March 9, 2023
person dharshininews
మృతురాలి కుటుంబానికి సాయం
మృతురాలి కుటుంబానికి సాయం - అంత్యక్రియలకు నగదు అందజేత - ఔన్యత్యం చాటిన బీఆర్ఎస్ నాయకులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: మృతురాలి కుటుంబానికి తాండూరు మండల బీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. తాండూరు మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అల్లాపూర్ వెంకటమ్మ మరణించారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ తాండూరు మండలం మైనర్టీ సెల్ అధ్యక్షులు షేక్ హసేన్ పటేల్, ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌ తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు. వెంకటమ్మ అంత్యక్రియల కోసం రూ. 3500లు ఆమె కుమారుడు అల్లాపూర్ వెంకట్‌కు షేక్‌ హసన్‌ పటేల్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకలు జీ. మైనొద్దీన్, నగరం బుడ్డన్న, కామిని శ్రీనివాస్‌, తుల్జప్ప, కృష్ణ, ఇర్షాద్ పటేల్, ముస్తఫా తదితరులు పాల్గున్నారు.