schedule Saturday, September 19, 2026

రుద్రభూమిలో శివుడు..!

calendar_today March 11, 2023
person dharshininews
రుద్రభూమిలో శివుడు..!
రుద్రభూమిలో శివుడు..! - రేపు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు - విజయవంతానికి సమాజం పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని వీరశైవుల రుద్రభూమి దిన దినాభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే రుద్రభూమిలో సీసీ రోడ్లు, విద్యుత్ దీపాల సౌకర్యాలు చేపట్టారు. తాజాగా రుద్రభూమిలో భారీ మహ శివుని విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, కార్యదర్శి గాజుల శాంతుకుమార్, సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. విగ్రహావిష్కరణ కోసం రుద్రభూమిలో మహ శివుని విగ్రహాన్ని తీసుకవచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు మహ శివుని విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాట్లు సిద్దమయ్యాయని అధ్యక్షులు పటేల్ శ్రీశైలం తెలిపారు. ప్రముఖ పండితులు మహంతయ్య స్వామి సమక్షంలో మహ శివుని ప్రతిష్టాపన ఉత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి వీరశైవ సమాజం సభ్యులు అందరు భారీగా తప్పక తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.