schedule Saturday, September 19, 2026

తాండూరు బ్రాహ్మణ సమాజం సంఘ ప్రమాణ స్వీకారం

calendar_today March 12, 2023
person dharshininews
తాండూరు బ్రాహ్మణ సమాజం సంఘ ప్రమాణ స్వీకారం
తాండూరు బ్రాహ్మణ సమాజం సంఘ ప్రమాణ స్వీకారం - అధ్యక్షులుగా గురురాజ్‌ దీక్షిత్, ప్రధాన కార్యదర్శులుగా గురురాజ్ జోషి - సన్మానించిన సంఘం సభ్యులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ బ్రాహ్మణ సమాజ సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఆదివారం తాండూరు పట్టణం సీతారాంపేట్‌లోని పాండురంగా దేవాలయంలో సంఘం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంఘం నూతన అధ్యక్షులుగా గురురాజ్‌ దీక్షిత్, ప్రధాన కార్యదర్శులుగా గురురాజ్ జోషి(బెన్నూర్)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్ష, కార్యదర్శులను సమాజం సభ్యులు, నేతలు శాలువా పూలమాలలతో సన్మానించారు. అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ తాండూరు బ్రాహ్మణ సమాజాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అందరి సహాకారంతో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సమాజం సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.