schedule Sunday, July 05, 2026

ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కమల్ ఆతహర్

calendar_today March 15, 2023
person dharshininews
ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కమల్ ఆతహర్
ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కమల్ ఆతహర్ - తాండూరు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న సభ్యులు -  అభినందించిన ముస్లిం పెద్దలు, ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా కమల్ అతహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం రాత్రి తాండూరు పట్టణం ఇందిరా చౌరస్తా సమీపంలోని మదీనా మసీదులో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా అధ్యక్ష స్థానానికి 21 మంది అభ్యర్థులు పోటీ పడగా అందరు కమల్ ఆతహర్ ను నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో పాటు కోశాధికారిగా మహమ్మద్ యూనుస్ ను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శి పదవికి ఎన్నికలు నిర్వహించగా ఖాలెద్ సఫీఉల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు కమల్ అతహర్ మాట్లాడుతూ అసోసియేషన్ అభ్యున్నతితో పాటు ముస్లిం సోదరుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సీనీయర్ సభ్యులు, పెద్దలు, యువకులు పాల్గొన్నారు.