schedule Saturday, September 19, 2026

శభాష్ ముఖేష్..!

calendar_today March 15, 2023
person dharshininews
శభాష్ ముఖేష్..!
శభాష్ ముఖేష్..! - అదరొగొట్టు అంటూ కేటీఆర్ అభినందన - వరల్డ్ బిగెస్ట్ రియాలిటీ షోకు మైల్వార్ కుర్రాడి టీం - ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో కేటీఆర్ తో మీట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్ ముఖేష్ అంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామానికి చెందిన స్టంట్ మాస్టర్‌ను అభినందించారు. మైల్వార్ గ్రామానికి చెందిన మాస్టర్ ముఖేష్ అండ్ టీం వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో(అమెరికా గాట్ టాలెంట్ పార్టీస్ సెంట్)కు టీం ఎంపికయ్యింది. ఈ నేపథ్యంలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో బుధవారం ముఖేష్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాస్టర్ ముఖేష్ ను శభాష్ అంటూ అభినందించారు. రియాలిటీ షోలో ఆదరగొట్టాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల ప్రాంతానికి చెందిన ముఖేష్ అంట్ టీం వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో కు ఎంపిక కావడం తాండూరు ప్రాంతానికి గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో ముఖేష్ రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకరావాలని ఆకాంక్షించి.. అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయులు, ఎంపిటీసీ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.